Header Banner

డైరెక్టర్‌తో సమంత లవ్‌ ఎఫైర్‌! అసలు నిజం తేల్చేసిన మేనేజర్‌, ఏం చెప్పాడంటే?

  Fri May 16, 2025 16:36        Entertainment

ప్రముఖ నటి సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు మధ్య ఏదో జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై ఆమె మేనేజర్ స్పందించారు. అవన్నీ నిరాధారమైన పుకార్లేనని కొట్టిపారేశారు. సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమా విజయం నేపథ్యంలో ఆ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన రాజ్‌ నిడిమోరుతో కలిసి సమంత దిగిన కొన్ని ఫొటో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఫొటోల ఆధారంగా వీరిద్దరిపై మరోసారి రూమర్లు ఊపందుకున్నాయి. సమంత తన నిర్మాణంలో తొలి ప్రయత్నంగా తెరకెక్కిన 'శుభం' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా విజయోత్సవంలో భాగంగా దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో కలిసి దిగిన ఒక ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటో ఇంటర్నెట్‌లో విస్తృతంగా షేర్ కావడంతో సమంత, రాజ్‌ నిడిమోరు త్వరలో కలిసి జీవించబోతున్నారంటూ కొన్ని ఆంగ్ల వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

 

ఇది కూడా చదవండి: భయంకరమైన ఘటన.. 14 రోజుల పసికందును గొంతు కోసి చంపిన కసాయి తండ్రి!

 

అంతేకాదు, రాజ్‌ ఇప్పటికే తన భార్యకు విడాకులు ఇచ్చారని కూడా పేర్కొన్నాయి. ఈ పుకార్లు తీవ్రం కావడంతో సమంత మేనేజర్ స్పందించారు. ‘‘సమంత, రాజ్‌ల గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే’’ అని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య కేవలం వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉందని చెప్పారు. 'శుభం' సినిమా విజయం పట్ల సమంత ఆనందం వ్యక్తం చేశారు. ‘‘మా మొదటి అడుగును ప్రేమతో స్వాగతించినందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమంత గతంలో రాజ్‌ నిడిమోరు, డీకే దర్శకత్వంలో వచ్చిన 'ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2' వెబ్ సిరీస్‌లో నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లోనే 'సిటడెల్‌: హనీ బన్నీ' అనే మరో వెబ్ సిరీస్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య స్నేహబంధం బలపడిందని, అయితే దానిని అపార్థం చేసుకుని ఇలాంటి రూమర్లు సృష్టిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Samantha #samanthatalks #Tollywood #Bollywood #heronie #Tollywoodheronie #socialmedia